Showing posts with label Medical. Show all posts
Showing posts with label Medical. Show all posts

Friday, March 27, 2020

పుట్టిన బిడ్డకు 60 సెకెన్లు ఆలస్యంగా బొడ్డుతాడు కోస్తే మెరుగైన ప్రయోజనాలు వుంటాయి

బిడ్డ పుట్టిన వెంటనే బొడ్డుతాడును వెంటనే కత్తిరించకుండా 60 సెకెన్లపాటు వేచియుండి తరువాత బొడ్డుతాడును కత్తిరిస్తె మెరుగైన ప్రయోజనాలుంటాయని రెండు అంతర్జాతీయ అధ్యయనాలు తాజాగ తెలియ చేసినవి.
ప్రయోజనాలు:
1)  ప్రసవమైన వెంటనే కాకుండా కాస్తా ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరిస్తే తల్లి నుంచి శిశువుకు  ఎర్రరక్తకణాలతో  సహా అన్ని ఆవస్యక కణాలు, పోషకాలు తగిన మోతాదులో అందుతాయని  చెబుతున్నారు.
2)  37 వారాలు కూడా నిండకముందే జన్మించిన మూడు వేల మంది శిశువులమీద పరిశోదన చేసిన తరువాత  సిడ్ని యూనివర్సిటీ పరిశోధకులు ఈ అంశాన్ని నిర్దారించారు. ‘ఆస్ట్రేలియన్ ప్లాసెంట్రల్ ట్రాన్స్ ప్యుషణ్ స్టడీ’  పరిశోదకులు ఈ విషయాన్ని సమర్ధించినారు.   
3)  నెలలు నిండకుండానే పుట్టినటువంటి శిశువుల మరణాలను ఈ విధానంలో33%  తప్పించ్చవచ్చని తెలియచేస్తున్నారు. 


***

ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్’ ప్రక్రియతో మోకాళ్ళ భాదలకు ఇక స్వస్తి

Autologous Chondrocyte Implantation Process

మోకాలి చిప్ప అరిగిపోయి కీళ్ళ నొప్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులు భాదపడుతూ గడుపుతున్న వారికి ఒక శుభవార్త. అయితే వారి మొకాలులోని ఆరోగ్యవంతమైన ప్రాంతం నుంచి కాండ్రోసైట్ కణాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో కణజాలంగా అభివృద్ధి చేశారు.  వీటితో మృదులాస్థితి తదితర చోట్ల కచ్చితంగా విజయవంతమయ్యేలా శస్త్ర చికిత్స చేయవచ్చని ప్రొఫెసర్ లీల బియంట్ అంటున్నారు.

‘ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్’ గా పిలుస్తున్న ఈ ప్రక్రియను స్వీడన్ కు చెందిన National Institute of Health and Care Excellence ఇప్పటికే ఆమోదం తెలిపినది.

దీర్ఘ కాల మోకాలు బాదితులకే కాదు తీవ్రంగా గాయపడిన క్రీడాకారులకి మళ్ళీ ఆటలో పుంజుకోనేందుకు ఈ “స్వీయ కణజాలం” తో చికిత్స అందించవచ్చు అంటున్నారు ఈ బియంట్.    

అతి త్వరలో ఈ వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశము వుంటుంది.

***