Showing posts with label Labour Office. Show all posts
Showing posts with label Labour Office. Show all posts

Sunday, May 31, 2020

జీతాలు చెల్లించకపోతే చర్యలు

విశాఖపట్నం, అక్కయ్యపాలెం లేబర్ ఆఫీస్ : లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పరిశ్రమల లోని రెగ్యులర్ మరియు ఒప్పంద కార్మికు
లకు
మార్చి నెలలలో ఇవ్వవలసిన జీతాలను వెంటనే యాజమాన్యాలు చెల్లించాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కార్మికశాఖ ఉప-కమిషనర్‌ వెంకటరమణ పట్నాయక్‌ హెచ్చరిక చేసారు.

ఏప్రిల్‌ నెల జీతాలు కూడా చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

గతనెల జీతాల చెల్లింపులకు సంబంధించిన వివరాలను కార్మికశాఖ మెయిల్‌: dclvizag.labour@gmail.com కు
పంపాలన్నారు.


వలస కార్మికుల జీతాలు, వసతి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూం టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0002 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.