Showing posts with label infant. Show all posts
Showing posts with label infant. Show all posts

Friday, March 27, 2020

పుట్టిన బిడ్డకు 60 సెకెన్లు ఆలస్యంగా బొడ్డుతాడు కోస్తే మెరుగైన ప్రయోజనాలు వుంటాయి

బిడ్డ పుట్టిన వెంటనే బొడ్డుతాడును వెంటనే కత్తిరించకుండా 60 సెకెన్లపాటు వేచియుండి తరువాత బొడ్డుతాడును కత్తిరిస్తె మెరుగైన ప్రయోజనాలుంటాయని రెండు అంతర్జాతీయ అధ్యయనాలు తాజాగ తెలియ చేసినవి.
ప్రయోజనాలు:
1)  ప్రసవమైన వెంటనే కాకుండా కాస్తా ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరిస్తే తల్లి నుంచి శిశువుకు  ఎర్రరక్తకణాలతో  సహా అన్ని ఆవస్యక కణాలు, పోషకాలు తగిన మోతాదులో అందుతాయని  చెబుతున్నారు.
2)  37 వారాలు కూడా నిండకముందే జన్మించిన మూడు వేల మంది శిశువులమీద పరిశోదన చేసిన తరువాత  సిడ్ని యూనివర్సిటీ పరిశోధకులు ఈ అంశాన్ని నిర్దారించారు. ‘ఆస్ట్రేలియన్ ప్లాసెంట్రల్ ట్రాన్స్ ప్యుషణ్ స్టడీ’  పరిశోదకులు ఈ విషయాన్ని సమర్ధించినారు.   
3)  నెలలు నిండకుండానే పుట్టినటువంటి శిశువుల మరణాలను ఈ విధానంలో33%  తప్పించ్చవచ్చని తెలియచేస్తున్నారు. 


***