Autologous Chondrocyte Implantation Process
మోకాలి చిప్ప అరిగిపోయి కీళ్ళ నొప్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులు భాదపడుతూ గడుపుతున్న వారికి ఒక శుభవార్త. అయితే వారి మొకాలులోని ఆరోగ్యవంతమైన ప్రాంతం నుంచి కాండ్రోసైట్ కణాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో కణజాలంగా అభివృద్ధి చేశారు. వీటితో మృదులాస్థితి తదితర చోట్ల కచ్చితంగా విజయవంతమయ్యేలా శస్త్ర చికిత్స చేయవచ్చని ప్రొఫెసర్ లీల బియంట్ అంటున్నారు.
‘ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్’ గా పిలుస్తున్న ఈ ప్రక్రియను స్వీడన్ కు చెందిన National Institute of Health and Care Excellence ఇప్పటికే ఆమోదం తెలిపినది.
దీర్ఘ కాల మోకాలు బాదితులకే కాదు తీవ్రంగా గాయపడిన క్రీడాకారులకి మళ్ళీ ఆటలో పుంజుకోనేందుకు ఈ “స్వీయ కణజాలం” తో చికిత్స అందించవచ్చు అంటున్నారు ఈ బియంట్.
అతి త్వరలో ఈ వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశము వుంటుంది.
***
No comments:
Post a Comment