#ugchelpline,#coronatimeugchelpline,#covid-19,
Delhi: పరీక్షలు, విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇతర అంశాల పరిష్కారం కోసం యూజీసీ ఫోన్ నంబర్ 011-23236374 తో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ప్రశ్నలు, ఫిర్యాదులు, స్టూడెంట్స్, ఉపాద్యాయులు, విద్యా సంస్థలకు ఉన్నఅనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ హెల్ప్‌లైన్ పని చేస్తుంది.
దీంతో పాటు ఇమెయిల్: covid19help.ugc@gmail.com పేరుతో ఒక ఈ మెయిల్‌నూ ఏర్పాటు చేసింది. ఈ ఇమెయిల్ లో కూడా సంప్రదించ వచ్చు.
కరోన కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి యూనివర్సిటీ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని యూజీసీ ఇప్పటికే ప్రకటించినది. విద్యా క్యాలెండర్ ఆధారంగా అన్ని విద్యాసంస్థలు తమ కార్యకలాపాలను మొదలు పెట్టాలని, ఇదే సమయంలో అందరి ఆరోగ్య భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.
***
No comments:
Post a Comment