Friday, April 3, 2020

కరోనావైరస్ వ్యాధి ఎలా వచ్చింది? COVID-19 అంటే ఏమిటి?

 కరోనావైరస్ వ్యాధి ఎలా వచ్చింది?

ప్రపంచం లో ఆదిపత్యాన్ని సంపాదించాలి అని ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తుంటారు అది మంచి కోరి చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. చెడు కోరి చేస్తే అది చెడు ఫలితాన్ని ఇస్తుంది. అలా ఆదిపత్యాన్ని చలాయించాలి అంటే అది ఎన్నో రోజులు వుండదు. ఇది జగమెరిగిన సత్యం.   

ఆదిపత్యాన్ని సంపాదించాలి అని వైరస్ పుట్టించారు అంటారు. అది చైనా ప్రయోగ శాల నుంచి వచ్చింది అని అంటారు.  మరికొంత మంది చైనా వారు జంతు మాంసాన్ని తినడం వలన ఆ జంతు కలేబరాలకి వైరస్ వుండటం వలన వచ్చింది అంటారు. మొత్తానికి ప్రపంచం లో ముందు ఈ వైరస్ చైనా లో వచ్చింది. ఇది ప్రపంచాన్ని సైతం వణికిస్తుంది. 
కాక పోతే దీనికి ధాఖలాలు లేవు.   


కరోనావైరస్ వ్యాధి ని COVID-19 అని ఎందుకు పిలుస్తారు? 
ఎక్కడ పుట్టింది?
కొన్ని దశాబ్దాల క్రితమే కరోనా వైరస్ యొక్క జాడ బయటపడింది. కరోనా వైరస్ ఒక వైరస్ కాదు. ఇది వైరస్ కుటుంబం పేరు.   కోవిడ్-19 వైరస్ మనుషుల నుంచి శరవేగంగా మనుషులకు సంక్రమించే వైరస్.  ఈ వైరస్ ఎక్కడ నుంచి మనుషులకు వ్యాపించిందో అనేది  చైనా ఆరోగ్య అధికారుల వద్ద సరైన సమాధానం లేదు.  మధ్య చైనాలోని వూహాన్ ప్రాంతంలో కరోనా వైరస్ మొదటి కేసు నమోదైంది. అయితే ఇది సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచి వ్యాపించినట్లు అనుకుంటున్నారు. వుహాన్‌లోని చికెన్ మార్కెట్‌లో చట్టవిరుద్ధంగా పలు అడవి జంతువులను కూడా అమ్ముతుంటారు.  క్రెయిట్ పాములు, నాగు పాములు, గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు చైనా శాస్త్రవేత్తల చూచా చాయగా చెబుతున్నారు.

కరోనా వైరస్ పేరెలా వచ్చింది ?
ఈ వైరస్‌ను మైక్రోస్కోప్ కింది నుంచి పరిశీలిస్తే గుండ్రటి ఆకారం చుట్టూ మేకుల్లా పొడుచుకు వచ్చిన ఒక పోషకపదార్థంగా ఉంటుంది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం. ఈ వైరస్ చుట్టూ ఒక కిరీటం వంటి ఆకృతి కనిపిస్తుంది కనుక దీనిని కరోనా అని శాస్త్ర వేత్తలు వ్యవహరించారు.

కరోనా వైరస్ పేరు కోవిడ్-19గా మార్పు
కరోనా అనే పేరు ఇప్పటికే వ్యక్తులకు, ప్రాంతాలకు, సంస్థలకు ఉండటం వల్ల అది ఒక వ్యాధిని సూచించే వైరస్‌గా మాత్రమే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) కరోనా వైరస్ పేరును కోవిడ్-19గా మర్చినట్లు ప్రకటించింది.

స్వైన్‌ఫ్లూకు మరియు కోవిడ్- 19కు పోలిక:
కోవిడ్-19 కు H1 N1 వైరస్ లక్షణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ వైరస్ మాదిరి గానే కోవిడ్-19 కూడా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ వాతావరణంలో చేరి, గాలి ద్వారా సమీపంలో ఉన్నవారికి సోకుతుంది. కోవిడ్-19, మనిషికి సోకిన పది రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతాయి. స్వైన్‌ఫ్లూలో కన్పించే లక్షణాలే (దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు) కరోనాలోనూ కన్పిస్తాయి.
ఈ రెండు వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండటం వ్యాధి గుర్తింపు వైద్యులకు కూడా కష్టమే. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తే గాని.. కరోనా నిర్ధారణ చేయడం కుదరదు.

వ్యాప్తి ఇలా..
  •     ఈ వైరస్ జంతువుల్లోను, జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తి చెందగలదు.
  •     గాలి ద్వారా ఇతరులకు సోకుతుంది. వైరస్ బారినపడ్డ వారికి సన్నిహితంగా వుండటం కూడా ప్రమాదకరమే.
  •     వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్... ఈ వ్యాధికి కేంద్ర స్థానమని శాస్త్రవేత్తల అభిప్రాయము.
వ్యాధి లక్షణాలు
కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందేందుకు ముఖ్యకారణం మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండటమే. కోవిడ్-19 సోకినట్లయితే మొదటి దశలో శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఆయాసం వస్తుంది. ఛాతిలో నొప్పిగా ఉంటుంది. రెండో దశలో దగ్గు, జ్వరం వస్తుంది. మూడో దశలో అది పూర్తి నిమోనియాగా మారుతుంది. అప్పటికీ నివారించలేకపోతే శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రాణం పోతుంది. వ్యాధి సోకిన రోగులు ఆస్పత్రిలో చేరి 14 రోజులపాటు ఇంకుబేటర్‌లో ఉంటే చాలు... వ్యాధి నుంచి బయట పడవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  •     కోవిడ్-19 గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా శుభ్రమైన గుడ్డను అడ్డం పెట్టుకోవాలి. అత్యవసర సమయాల్లో మడచిన మోచేతిని అడ్డుగా పెట్టుకోవడం మంచిది.
  •     చైనా, దాని సరిహద్దు దేశాల నుంచి వచ్చే వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం వంటివి ఎంత మాత్రం చేయరాదు.
  •     ఎప్పటికప్పుడు సబ్బు, ఆల్కహాల్‌తో కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ముఖం కడుక్కోవాటం మంచిది.
  •     దగ్గు, తుమ్ములతో బాధ పడుతున్న వారికి దూరంగా ఉండాలి.
  •     ముక్కు, నోటిని కప్పి ఉంచే మాస్క్‌లు ధరించాలి.
  •     మాంసాహారం మానేయడం లేదా ఉడికీ ఉడకని మాంసం తినకుండా ఉండడం, మాంసాహార విక్రయశాలకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం
  •     వన్యప్రాణులకు దూరంగా ఉండటం లేదా సరైన సంరక్షణలో లేని జంతువుల వద్దకు వెళ్లకుండా ఉండడం మంచిది.
  •     అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం మంచిది.
  •     అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం మంచిది.
  •     గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం మంచిది.
  •     ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
  •     ఉతికిన దుస్తులు ధరించడం మంచిది.
  •     వైరస్ సోకిన వారికి దూరంగా ఉండటం మంచిది.
***

No comments:

Post a Comment