Friday, March 27, 2020

కృషి+కసి=జయం


ఏది సాధించాలన్నా లక్ష్యంతో పాటు మన కసి, కృషి బలంగా ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. నేటి యువత తాము ఎన్నుకున్న రంగంలో విజయం పొందాలంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా పట్టుదలతో శ్రమిస్తే గమ్యాన్ని చేరడం ఎంతో మంచిది. శిక్షణ శిబిరంలో దీపిక తండ్రి సుబ్బారావు వాలీబాల్‌ క్రీడాకారుడు. వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. తల్లి బేబీ ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్లక్రితం దీపిక డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమెలోని క్రీడాస్ఫూర్తిని, పోలీసుశాఖపై ఉన్న ఆసక్తిని తండ్రి గుర్తించారు. అదే సమయంలో ప్రభుత్వం ఎస్‌ఐల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో దీపికలో ఎస్సై పోస్టు సాధించాలనే పట్టుదల పెరిగింది. 

సుబ్బారావు ప్రతిరోజు తెల్లవారుజామునే ఆమెను మైదానానికి తీసుకెళ్లి పరుగు పందెంలో రాణించేందుకు తీసుకోవాల్సిన మెలకువలు వివరించేవాడు. వ్యాయామంతో పాటు, పౌష్టికాహరం విషయంలో జాగ్రత్తలు పాటించేవారు. ఇలా ఏడాదిన్నరపాటు సుబ్బారావు కుమార్తెను వ్యాయామంలో రాణించేందుకు శిక్షణ ఇచ్చారు. అనంతరం గుంటూరులో ఎస్‌ఐ పోస్టుకు అవసరమైన రాతపరీక్ష విషయంలో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. మొదటి ప్రయత్నంలో రాతపరీక్షలు, పరుగుపందెం, ఇతర పరీక్షల్లోను దీపిక విజయం సాధించింది.

ప్రస్తుతం విశాఖపట్టణంలో శిక్షణ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తోంది. ప్రజాసేవకు అవకాశంపజాసేవ చేసేందుకు ప్రభుత్వం చక్కని అవకాశం కల్పించింది. పోలీసుశాఖపై ప్రజల్లో ఒక మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా విధులు నిర్వహిస్తాను. పట్టుదలతో ముందుకు వచ్చి, ఎస్‌ఐ పోస్టు సాధించాను. యువత గట్టిగా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నేడు పోటీ చాలా తీవ్రంగా ఉంది. కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.

- దీపిక, శిక్షణ ఎస్‌ఐ, విశాఖపట్నం

***

No comments:

Post a Comment