Friday, April 3, 2020

COVID-19 ఏదైనా సమస్య పరిష్కారం కాకపొతే ఈనాడు ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి

మేమున్నాం.. మీకు ఆసరాగా! అని ఈనాడు పేపర్ వారు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తారు.

కరోనా ప్రభావం... లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రస్తుతం ఇళ్ల నుంచి ఎవరూ కదల్లేని పరిస్టితి. ఈ పరిస్తితులలో సరకులు మీ ప్రాంతం లో లభ్యంకాకపోయినా, అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నా, 'ఈనాడు' మీకు అండగా నిలవనుంది.


ఈ క్రింది వాటి సమస్యను వారికి తెలియజేస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.

పాలు, వైద్య సాయం, కూరగాయలు, బౌషధాలు, తాగు నీరు ఇలా నిత్యావసర వస్తువులు ఏవైనా మీ ప్రాంతంలో అందుబాటులో లేకపోయినా, గంటల తరబడి విద్యుత్తు సరఫరా లో అంతరాయాలు ఎదురవుతున్నా ఈనాడు దృష్టికి తీసుకువెళ్ళండి.

మీరు చేయాల్సిందల్లా సమస్య, మీ ప్రాంత వివరాలను 08966 264648, 94943 80699  ఫోన్‌ నంబరుకు తెలియజేయడమే. 
మీరు సంవ్రదించాల్సిన సమయం: ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం  1 గంట వరకు.

ఈ క్లిష్ట పరిస్థితిలో ఇటువంటి సేవ చేస్తున్న ఈనాడు వారికి కృతఙ్ఞతలు తెలుపుకున్దాము.
***

No comments:

Post a Comment