Tuesday, April 28, 2020

మంగళగ్‌రిలో ఉన్న ఎయిమ్స్‌లో ఉన్న వైద్యులను తెలిఫోన్ ద్వారా సంప్రదించవచ్చు

#mangalagiriaimsdoctorstelephonenumbers,#covid-19,
కరోన అంటువ్యాధి వలన ప్రపంచం గడ గడ లాడుతున్న సంగతి తెలిసిందే. మన ఆంధ్ర రాష్ట్రం లో కూడా లాక్ డౌన్ వలన ఎంతో మంది వారి యొక్క దీర్గ రోగాలతోని గాని, ఆకస్మిక రోగాలతో బాదపడుతున్నవారు గాని ఇక పై ఎయిమ్స్‌ లో టెలీ వైద్యులను సంప్రదించి ఈ లాక్ డౌన్ సమయం లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ మంగళగ్‌రిలో ఉన్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో telephone ద్వారా డాక్టర్స్ ను సంప్రదించవచ్చు.  ఎయిమ్స్‌లో రోగుల కోసం టెలీఫోన్ ద్వారా సంప్రదించే సేవలను ప్రారంబించారు.  రోగులు తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకుని ఫోన్‌ కాల్స్‌, లేదా వాట్సాప్‌ ఆడియో, వీడియో కాల్స్‌ ద్వారా సంప్రదించి వైద్యసేవలు పొందవచ్చు.

వైద్యులను బుధవారం (15-ఏప్రిల్-2020) నుంచి టెలిఫోన్ ద్వారా సంప్రదించే విధానాన్ని ప్రవేశపెట్టినట్టు  ఎయిమ్స్‌ అధికారులు ప్రకటించారు.

ఎయిమ్స్‌ హాస్పిటల్ లో ఉన్న 85230 01094 సెల్ నంబరులో వీడియోకాల్‌ లేదా ఆడియోకాల్‌, సంక్షిప్త సందేశం ద్వారా నిపుణులైన వైద్యులను దిగువ ఇచ్చిన సమయాలలో సంప్రదించవచ్చు.

ఏయే రోజుల్లో  ఏ ఏ వైద్యులను ఫోన్ లో కలవడం కోసం ఈ క్రింది పట్టికను చూడోచ్చు  
----------------------------------------------------------------------------------------
సోమవారం నుంచి శనివారం వరకు 
ఉదయం 9 A.M -11 A.M వరకు, 
మద్యాహ్నం 11 A.M - 1 P.M వరకు ఫోన్ లో వైద్యులను సంప్రదించవచ్చు.  

సోమవారం:
ఉదయం     9 A.M -11 A.M కు జనరల్‌ మెడిసిన్ వైద్యులను, 
మద్యాహ్నం 11 A.M - 1 P.M కు ఎముకల వైద్యుల ను సంప్రదించవచ్చు.

మంగళవారం:
ఉదయం     9 A.M -11 A.M కు కమ్యూనిటీ, ప్యామిలీ మెడిసిన్‌ వైద్యులను, 
మద్యాహ్నం 11 A.M - 1 P.M కు చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులను సంప్రదించవచ్చు. 

భుధవారం:
ఉదయం     9 A.M -11 A.M కు జనరల్‌ మెడీసిన్‌ వైద్యులను,  
మద్యాహ్నం 11 A.M - 1 P.M కు ఎముకల వైద్యులు ని సంప్రదించవచ్చు.

గురువారం:
ఉదయం     9 A.M -11 A.M కు చర్మవ్యాధులు వైద్యులను,
మద్యాహ్నం 11 A.M - 1 P.M కు చిన్నపిల్లల వైద్య నిపుణులను ని సంప్రదించవచ్చు.

శుక్రవారం:
ఉదయం     9 A.M -11 A.M కు కమ్యూనిటీ, ప్యామిలీ మెడిసిన్‌ వైద్యులను,  
మద్యాహ్నం 11 A.M - 1 P.M కు మహిళ, ప్రసూతి వైద్య నిపుణులు ని సంప్రదించవచ్చు.

శనివారం:
ఉదయం     9 A.M -11 A.M కు నేత్ర వైద్య నిపుణులను,  
మద్యాహ్నం 11 A.M - 1 P.M కు జనరల్‌ సర్జరీ వైద్యులుని సంప్రదించవచ్చు.

========================================================================
సోమచారం నుంచి శనివారం వరకు ఉదయం 9 - 11 గంటల మధ్య తమ  పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలి. 

రిజిస్టర్‌ చేసుకున్న తరువాత మీ నంబర్‌కు ఉదయం 11 గంటల నుంచి వైద్యులే ఫోన్‌ చేసి మీకు వైద్యసేవలు అందజేస్తారు.

మీకు ఏమైనా సందేహాలు, సలహాల కోసం 94930 65718, 85230 07940 ఫోన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలియజేసారు. 

మీరు  ఫోన్  చెయ్యాల్సిన  వైద్యుల ఫోన్‌ నంబర్లు  క్రింద ఇవ్వ బడినవి 
--------------------------------------------------------------------
కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్‌ కోసం 9494908320
ఈఎన్‌టీ 9494906407
జనరల్‌ మెడీసిన్‌ 9494908526
జనరల్‌ సర్జన్‌ 9494901428
ఎముకల వ్యాధి 9494903843
నేత్ర వైద్యం 9494905811
చర్మవ్యాధులు 9494908401
గైనకాలజీ 9494907302
పిల్లల వైద్యం 9494902674
దంత వైద్యం,
నొప్పుల నివారణకు 9494907082

***

No comments:

Post a Comment